10am టాప్ న్యూస్

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలుప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో లోక్‌సభ కానుండగా, జీరో అవర్‌తో రాజ్యసభ ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. నీట్‌ సహా పరీక్ష పత్రాల లీకేజీపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీలు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 


Published Jul 21, 2024 11:58:01 PM
postImages/2024-07-22/1721622896_WhatsAppImage20240721at10.16.10AM.jpeg

నీట్ అవకతవకలపై నేడు విచారణ 
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల జరిగిన విచారణలో పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు విడుదల చేయాలనీ సుప్రీం ఎన్టీఏకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్టీఏ పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు విడుదల చేసింది.  పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. 

 

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలుప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో లోక్‌సభ కానుండగా, జీరో అవర్‌తో రాజ్యసభ ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. నీట్‌ సహా పరీక్ష పత్రాల లీకేజీపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీలు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

 

నేటితో ముగియనున్న ఉజ్జయిని అమ్మవారి బోనాలు
సికింద్రాబాద్  ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. వడి బియ్యం, చీర సారెలతో అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగించనున్నారు. 

 

కొనసాగుతున్న రంగం 
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం కొనసాగుతోంది. అమ్మవారి ఎదుట భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తున్నారు. బోనాలు ఎవ్వరూ ఎత్తుకొచ్చిన సంతోషంగా అందుకుంటా అని తెలిపారు. ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని, వర్షాలు కురుస్తాయని అన్నారు. ఎలాంటి రోగాలు కూడా రాకుండా కాపాడుతానని అన్నారు.  
 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. 

 

మూడు రోజుల పాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. కాగా, ఇప్పటికే సంగారెడ్డి ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu topnews

Related Articles