BRS అధినేత కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వెళ్లనున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకాని విషయం తెలిసిందే. ఆ సమయంలో శస్త్రచికిత్స కారణంగా ఆయన హాజరుకాలేక పోయారు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా వెళ్లలేదు. అయితే, ప్రతిపక్షనేతగా మొదటిసారి ఈ రోజు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన సభలో అడుగుపెట్టనున్నారు.
నేడు అసెంబ్లీకి గులాబీ బాస్

నేడు బడ్జెట్ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కాళేశ్వరానికి BRS నేతలు
నేడు BRS నేతలు కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ముగిశాక BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం వద్దకు బయలుదేరనున్నారు. ఈరోజు సాయంత్రం ఎల్‌ఎండీ రిజర్వాయర్ సందర్శించనున్నారు. రాత్రి రామగుండంలో బస చేసి శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శించనున్నారు.
నగరంలో వర్షం
హైదరాబాద్ నగరవ్యాప్తంగా వర్షం కురుస్తోంది. గత వారం రోజులుగా ముసురు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నగరంలో పలు చోట్ల వర్షం పడుతుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మలక్‌పెట్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కొత్తపెట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
భారీ తగ్గిన బంగారం ధర
మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. తగ్గిన ధరల ప్రకారం ప్రస్తుత ధర 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారంపై రూ:10తగ్గి 64,940 కి చేరింది. అంతేకాకుండా 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారంపై రూ:10 తగ్గి 70,850 కి చేరింది.