JNTU: జేఎన్టీయూలో ఎలుక కోసం వచ్చిన పిల్లి

ఇక ఈ విషయాన్ని మరువక ముందే, అదే హాస్టల్‌లో విద్యార్థులు తినే ఆహారాన్ని పిల్లి తింటూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. అది చూసిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓసారి హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం బయట పడ్డప్పటికీ.. ఇంకా మార్పు తెచ్చుకోకుండా విద్యార్థులు తినే ఆహారం కూడా శుభ్రమైన విధంగా ఇవ్వలేనప్పుడు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. 
 
Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721104703_modi20240716T100315.473.jpg

న్యూస్ లైన్ డెస్క్: సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ క్యాంపస్ హాస్టల్ యాజమాన్యం పనితీరు ఇప్పటికీ మారలేదు. విద్యార్థులు తినే చెట్నీలో ఇటీవల ఎలుక స్విమ్మింగ్ చేసిన విషయం తెలిసిందే. ఉదయం టిఫిక్ కోసం తయారు చేసిన చెట్నీలో ఎలుక ఈత ఈత కొడుతూ కనిపించింది. విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

దీంతో జేఎన్టీయూ యాజమాన్యంపై పులువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తినే ఆహారం పట్ల కనీస జాగ్రత్తలు పాటించరా అని ప్రశ్నించారు. మరోవైపు విద్యార్థులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని, అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇక ఈ విషయాన్ని మరువక ముందే, అదే హాస్టల్‌లో విద్యార్థులు తినే ఆహారాన్ని పిల్లి తింటూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. అది చూసిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓసారి హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం బయట పడ్డప్పటికీ.. ఇంకా మార్పు తెచ్చుకోకుండా విద్యార్థులు తినే ఆహారం కూడా శుభ్రమైన విధంగా ఇవ్వలేనప్పుడు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. 

అయితే, చట్నీలో ఎలుక కనిపించినప్పుడు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ మాధురి, RDO పాండు జేఎన్టీయూ క్యాంపస్‌‌ను పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. వంటగదిని అడిషనల్‌ కలెక్టర్‌ పరిశీలించారు. కిచెన్‌ పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ప్రిన్సిపాల్ మాత్రం ఎవరో ఆకతాయి విద్యార్థులే ఎలుకను చట్నీలో పడేశారని బుకాయించారు. ఇక ఈసారి పిల్లిని ఎవరు తీసుకొచ్చారని చెబుతారో చూడాలి. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu hyderabad telanganam jntu jntuhostel

Related Articles