తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై నిలిచిన బురద నీటిలో నాట్లు వేస్తూ గ్రామస్థులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యూస్ లైన్ డెస్క్: అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా పెరిగి మున్సిపాలిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదవ వార్డుకు చెందిన ప్రజలు రోడ్డు దెబ్బతినడంతో అవస్థలు పడుతున్నామని అన్నారు. గత రెండు నెలలుగా వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు పడిపోయాయని వెల్లడించారు. నడిచేందుకు ఇబ్బందిగా ఉందని, వర్షం వస్తే బురద నీరు రోడ్డుపైనే ఆగిపోతుందని అన్నారు. వాహనదారులు కూడా ఈ రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని.. ఇప్పటికే పలు మార్లు ఐసీసిడెంట్లు కూడా అయ్యాయని తెలిపారు.
ఇప్పటికే గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై నిలిచిన బురద నీటిలో నాట్లు వేస్తూ గ్రామస్థులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన pic.twitter.com/Sw5FOv03JS — News Line Telugu (@NewsLineTelugu) August 4, 2024