ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, విజయ్ నాయర్ తరపున కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ రాజ్య సభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వాదించి బెయిల్ ఇప్పించారు. దీంతో జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం నాయర్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే లిక్కర్ కేసులో సుదీర్ఘంగా అండర్ ట్రయల్ ఖైదీగా నాయర్ ఉండటంతో సుప్రీంకోర్టు అర్హుడు అని పేర్కొంది. లిక్కర్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చినట్లు సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు వాదనలు విన్న తర్వాత విజయ్ నయార్‌కి మంజారు చేసింది.