కేటీఆర్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంపై గట్టి ప్రభావమే చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో గురుకులాలు, హాస్టళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు జరిగాయి. కోయిలకొండ బీసీ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ హాస్టళ్లలో విస్తృతంగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. హాస్టల్స్‌లో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు అందించే ఆహారపదార్థాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టుగా అధికారులు గుర్తించారు.
కాగా, త్వరలోనే రాష్ట్రంలోని గురుకులాలు, వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శిస్తామని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కేటీఆర్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంపై గట్టి ప్రభావమే చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో గురుకులాలు, హాస్టళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు జరిగాయి. కోయిలకొండ బీసీ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యత లేని ,పురుగులు పట్టిన కిరణ సామాగ్రితో భోజనం పెడుతున్నారని అధికారాలు తెలిపారు.