అక్కడ లభ్యమైన గన్‌తో నిందితుడు తమపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ట్రీట్‌మెంట్ కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. తిరువేంగడం అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీస్ అధికారులు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న తిరువేంగడం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. శనివారం సాయంత్రం ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కోసం నిందితుడు తిరువేంగడం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు చెన్నై పోలీసులు నిందితుడిని హత్య జరిగిన చోటుకి తీసుకొని వెళ్లారు.
అయితే, అక్కడ లభ్యమైన గన్‌తో నిందితుడు తమపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ట్రీట్‌మెంట్ కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. తిరువేంగడం అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీస్ అధికారులు తెలిపారు.
కాగా, తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. చెన్నైలోని పెరంబూర్‌లో రాత్రి తన ఇంటి ముందు నిల్చొని ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్‌పై ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. గమనించిన స్థానికులు.. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చికిత్స నిమిత్తం థౌజండ్‌లైట్స్‌లోని అపోలో హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.