Hyderabad: బతికే ఉన్నా.. ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన

సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్ధురాలు తన ఆవేదనను వినతిపత్రంలో రాసి అధికారులకు అందించింది. ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59) తన భర్త చనిపోవడంతో ఒంటరి మహిళ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, తన అధికారులు మాత్రం ఆమె చనిపోయిందంటూ రికార్డుల్లో ఉందని తెలిపారట. దీంతో పెన్షన్ ఇవ్వడం కుదరదని అన్నారట. బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెబుతున్నారని ఆ వృద్దురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 
 
Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721108869_modi20240716T111623.249.jpg

న్యూస్ లైన్ డెస్క్: బతికే ఉన్నప్పటికీ చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో BRS అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చిందని.. ఇప్పుడు మాత్రం పెన్షన్ కూడా ఇవ్వడం లేదని వాపోయింది.

సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్ధురాలు తన ఆవేదనను వినతిపత్రంలో రాసి అధికారులకు అందించింది. ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59) తన భర్త చనిపోవడంతో ఒంటరి మహిళ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, తన అధికారులు మాత్రం ఆమె చనిపోయిందంటూ రికార్డుల్లో ఉందని తెలిపారట. దీంతో పెన్షన్ ఇవ్వడం కుదరదని అన్నారట. బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెబుతున్నారని ఆ వృద్దురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

తాను బతికే ఉన్నానని, ఇప్పటికైనా తనకు పెన్షన్ వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో వినతి పత్రం అందించింది. ఇక ఆ వృద్ధురాలి పరిస్థితి చూసినవారంతా చెట్టంత మనిషి ఎదురుగా కనిపిస్తుంటే చనిపోయిందని అనడం ఏంటి.. బతికున్నట్లు నిరూపించుకోవడం ఏంటని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. 

newsline-whatsapp-channel
Tags : revanth-reddy newslinetelugu congress telanganam congress-government prajadarbar

Related Articles