Nayanthara: ఓటీటీలోకి నయనతార వివాదాస్పద సినిమా..

నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ను టెలికాస్ట్ చేస్తున్నారు . అయితే దీనిలో ట్విస్ట్ ఉంది ఏంటంటే.. ఇండియాలో నయన్ సినిమా రావడం లేదు


Published Aug 09, 2024 01:38:00 PM
postImages/2024-08-09/1723191101_image.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నయన్ నటించిన 'అన్నపూర్ణి' డిసెంబర్ 2023లో విడుదలైంది. కాని ఇంకా ఓటీటీ లోకి రాలేదు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఓటీటీ లో ఆపేశారు. మళ్లీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ను టెలికాస్ట్ చేస్తున్నారు . అయితే దీనిలో ట్విస్ట్ ఉంది ఏంటంటే.. ఇండియాలో నయన్ సినిమా రావడం లేదు...వేరే ఏ కంట్రీ అయినా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.


చిత్రానికి ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ సినిమాలో లవ్ జిహాద్ అంశాలు ఉన్నాయని కొందరు ఆరోపించడంతో నిర్మాత క్షమాపణలు చెప్పారు. చిన్న చిన్న మార్పులు కూడా చేశారు. మళ్లీ నెట్‌ఫ్లిక్స్‌లో ‘అన్నపూర్ణి’ సినిమా ప్రసారానికి సన్నాహాలు జరిగాయి. ఆగస్ట్ 9 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
అయితే భారత్ లో కూడా ఏమైనా మార్పులు చేసి రిలీజ్ చేస్తారా చూడాలి.‘అన్నపూర్ణి’ సినిమా వివాదంలో చిక్కుకున్నప్పుడు నటి నయనతార ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సినిమా ఉద్దేశ్యం ప్రజల్లో స్ఫూర్తి నింపడమే తప్ప ఎవరినీ నొప్పించకూడదని ఆమె తెలిపింది. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news nayanthara net-flex

Related Articles