ఆయనతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పలువురు నాయకులు అధికార పార్టీలో చేరుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో ఎమ్మెల్యే అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.
శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అరికెపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా.. అరికెపూడి గాంధీతో ఆ సంఖ్య 9కి చేరింది.