ఆ వేడి ఇంకా తగగక ముందే, శేరిలింగంపల్లి ఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ.. బీఆర్ఎస్ కీలక నేతలు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. అమ్ముడు పోయి పార్టీల కండువాలు కప్పుకునే వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పలువురు నాయకులు అధికార పార్టీలో చేరుతున్నారు. ఈ ఇప్పటికే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా అధికార పార్టీలోకి వెళ్లారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వేడి ఇంకా తగగక ముందే, శేరిలింగంపల్లి ఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ.. బీఆర్ఎస్ కీలక నేతలు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. అమ్ముడు పోయి పార్టీల కండువాలు కప్పుకునే వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఇక తాజగా, మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. పార్టీ మార్పుపై క్లారిటీ ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన అనుచరులకు ఫోన్ చేసి తాను పార్టీ మారుతున్నట్లు తెలిపారు. ఇష్టం ఉన్నవారు తనతో పాటు పార్టీ మారవచ్చని, లేదంటే తమ ఇస్తామని మహిపాల్ రెడ్డి చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజగా, మహిపాల్ రెడ్డితో ఈ సంఖ్య 10కి చేరనుంది.