AP 10th Results: ఏపీ టెన్త్ రిజల్ట్స్ లో అమ్మాయిలదే మొదటి స్థానం ..ఏ జిల్లా ఫస్ట్ అంటే !

బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలురాగా.. 19పాఠశాలల్లో మాత్రం ఎవ్వరూ పాస్ కాలేదు.


Published Apr 23, 2025 12:20:00 PM
postImages/2025-04-23/1745391116_studentsphotopti15322719116x9.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏపీ లో పదోతరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆన్ లైన్ లో రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలురాగా.. 19పాఠశాలల్లో మాత్రం ఎవ్వరూ పాస్ కాలేదు.


జిల్లాల వారిగా ఫలితాలను పరిశీలిస్తే ఉత్తీర్ణీతలో పార్వతీపురం మన్యం అగ్రస్థానంలో ఉండగా ఈ జిల్లాలో దాదాపు 93.90 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత స్థానంలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలచింది. ఈ జిల్లాలో 91.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మూడో స్థానంలో విశాఖపట్టణం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 89.14శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 47.64శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu prelimsresults tenth-pass

Related Articles