చాలామంది హిందూ ప్రజలు దేవుడి పూజ సమయంలో తప్పనిసరిగా అగరవత్తులు వెలిగిస్తారు. అవి వెలిగిస్తేనే మనకు పూజ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అగరవత్తుల వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ కలిగిన ఫీలింగ్ వస్తుంది కానీ, వాటి నుంచి వచ్చే పొగ వల్ల మన శరీరానికి ఎంతో నష్టం కలుగుతుందట. మరి అగర్వత్తుల వాసన పీల్చడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా సిగరెట్ తాగడం, ఎంత అనర్థమో అగర్బత్తుల పొగ పీల్చడం కూడా అంతే అనర్ధమని అంటున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: చాలామంది హిందూ ప్రజలు దేవుడి పూజ సమయంలో తప్పనిసరిగా అగరవత్తులు వెలిగిస్తారు. అవి వెలిగిస్తేనే మనకు పూజ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అగరవత్తుల వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ కలిగిన ఫీలింగ్ వస్తుంది కానీ, వాటి నుంచి వచ్చే పొగ వల్ల మన శరీరానికి ఎంతో నష్టం కలుగుతుందట. మరి అగర్వత్తుల వాసన పీల్చడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా సిగరెట్ తాగడం, ఎంత అనర్థమో అగర్బత్తుల పొగ పీల్చడం కూడా అంతే అనర్ధమని అంటున్నారు.
తాజాగా సైంటిస్టులు అధ్యయనం చేసిన దాని ప్రకారం.. ఇంట్లో అగరబత్తులు వెలిగించడం వల్ల వాటి నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ మన ఆరోగ్యానికి హాని చేస్తుందట. ఇది ఊపిరితిత్తుల్లో చేరి కణాల వాపుకు కారణం అవుతుందని శ్వాసకోశ సమస్యలు తీసుకువస్తుందని అంటున్నారు. అంతేకాకుండా హైపర్సెన్సీటివిటి కారణంగా దగ్గు, తుమ్ములు కూడా ఎక్కువగా వస్తాయట.
ఈ అగర్వత్తుల్లో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్, ఫార్మల్డిహైడ్ ఆక్సైడ్లు ఉంటాయి. వీటివల్ల ఉబసం వంటి వ్యాధులు వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ పొగ వల్ల చర్మ సమస్యలు కూడా పెరిగిపోతాయని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. కాబట్టి అగరవత్తులు వాడే ముందు కాస్త ఆలోచించండి.