Fridge:మీ ఇంట్లో ఫ్రిడ్జ్  ఓ మూలన పెడుతున్నారా అయితే ప్రమాదమే.?

ఒకప్పుడు ఇంట్లో మట్టి కుండ ఉంటేనే అదే పెద్ద ఫ్రిడ్జ్. మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలిగేది. కానీ ప్రస్తుతం మట్టి కుండలు మాయమైపోయి పల్లెటూర్లలో కూడా రిఫ్రిజిరేటర్లు ఎంటర్


Published Aug 17, 2024 05:40:00 PM
postImages/2024-08-17/1723894101_frdge.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు ఇంట్లో మట్టి కుండ ఉంటేనే అదే పెద్ద ఫ్రిడ్జ్. మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలిగేది. కానీ ప్రస్తుతం మట్టి కుండలు మాయమైపోయి పల్లెటూర్లలో కూడా రిఫ్రిజిరేటర్లు ఎంటర్ అయ్యాయి. ఎవరింట్లో చూసినా తప్పనిసరిగా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది.  అలాంటి ఫ్రిడ్జ్ ను మనం మన ఇంట్లో మూలన పెట్టుకుంటాం. కానీ ఫ్రిజ్జులను  సరైన స్థలాల్లో పెట్టకుంటే మనకు నష్టాలు తప్పవట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా. 

 గోడకు ఆనుకొని:
 ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ ను మన ఇంట్లో పూర్తిగా గోడకు అనుకొని ఉండే విధంగా పెట్టరాదు. దీనివల్ల వెంటిలేషన్ సమస్య కూడా వస్తుందట. అంతేకాదు ఫ్రిడ్జ్ కూడా తొందరగా పాడైపోతుందట. ఇలా మనం గోడకానుకొని పెట్టడం వల్ల  శీతలీకరణ సామర్థ్యాన్ని కోల్పోతుందట. అది వేడెక్కిపోయి మెకానిక్ ఖర్చులను పెంచుతుందని విద్యుత్ వినియోగం కూడా పెంచుతుందని అంటున్నారు. అంతేకాదు ఒక్కోసారి బాగా వేడి అయ్యి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉందట.

 ఎండ ప్రదేశంలో:
 మన గ్రూప్ రిఫ్రిజిరేటర్ లోపల ఎంత చల్లదనాన్ని ఇస్తుందో దాన్ని బయట భాగంలో అంత వేడి ఉంటుంది. రిఫ్రిజిరేటర్ లను సూర్యకాంతి పడే ప్రదేశాలలో ఉంచకూడదట. దీనివల్ల ఫ్రిడ్జ్ పనితీరు తగ్గడమే కాకుండా విద్యుత్ వినియోగం పెరుగుతుంది.  అలాగే రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పై ఒత్తిడి పెరిగి దాని మన్నిక తగ్గుతుందట.  ఒక్కోసారి పేలుడు సంభవించే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. 

 నీటి ప్రదేశంలో :
 ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ను నీరు లీకేజీ అయ్యే తేమ ప్రదేశాల్లో అసలు ఉంచరాదు.  దీనివల్ల రిఫ్రిజిరేటర్ విద్యుత్ భాగాలకు వాటర్ తాగితే  షార్ట్ సర్క్యూట్ అయి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

 గ్యాస్ స్టవ్ దగ్గర :
ముఖ్యంగా ఇంట్లో ఉండే ఫ్రిజ్జులను వంట రూముల్లో పెడుతూ ఉంటారు. ఇదే తరుణంలో గ్యాస్ స్టవ్ కు మైక్రో ఓవెన్లకు ఈ రిఫ్రిజిరేటర్ దగ్గరగా ఉంచరాదట. దీనివల్ల వేడి పెరిగి ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

 ఏ స్థలంలో పెట్టాలి:
 రిఫ్రిజిరేటర్ ను దాని చుట్టూ తగినంత స్థలం ఉన్న ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. దీనివల్ల గాలి సరిగ్గా ప్రసరించి  దాని మన్నిక పెరుగుతుందట.

newsline-whatsapp-channel
Tags : news-line blast fridge home air-free

Related Articles