విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తాము ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఎదుర్కొంటున్నామన్నారు. ఎంతో మంది పిల్లలకు చదువులు నేర్పుతున్న తాము కుటుంబాలకు దూరంగా ఉంటూ, పిల్లలను చదివించే స్థోమత లేకుండా పోయిందన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రేవంత్ సర్కార్ తమకు అన్యాయం చేస్తుందంటూ తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టులు, నిర్బంధాలతో అడ్డుకున్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
2023 సెప్టెంబర్ నెలలో సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి tpcc అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక రెగ్యులర్ చేస్తామని హామి ఇచ్చారని, ఛాయ్ తాగినంత సేపటిలో సమస్యను పరిష్కరించవచ్చంటూ మాట్లాడారని గుర్తుచేసుకున్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలనే తామంతా హైదరాబాద్ వచ్చామని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. కొన్ని ఏండ్లుగా వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తున్న తమకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తుందని వాపోయారు.
విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తాము ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఎదుర్కొంటున్నామన్నారు. ఎంతో మంది పిల్లలకు చదువులు నేర్పుతున్న తాము కుటుంబాలకు దూరంగా ఉంటూ, పిల్లలను చదివించే స్థోమత లేకుండా పోయిందన్నారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు, బాధలు చెప్పుకుందామని వచ్చిన తమను అరెస్టులు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై మండిపడ్డారు. ఇప్పటికే ఎంతో మంది తోటి ఉద్యోగస్తులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక చనిపోయారని గుర్తు చేశారు. ఇక మీదట తమలో ఎవరు చనిపోయినా రేవంత్ సర్కారుదే పూర్తి బాధ్యత అన్నారు.