ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేక పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరువకముందే మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల పరిధిలోని అబ్బాపూర్ తండాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ 6 గగ్యారెంటీలను ముందుంచింది. ఇందులో భాగంగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించింది. అయితే, మహిళలు ప్రయాణం చేయగా అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ఆర్టీసీ సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్నారు. ఫ్రీ బస్సు ప్రయాణం కావడంతో మహిళలు ఇతర వాహన సౌకర్యాలను వాడుకోవడం మానేశారు. దీంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది.
ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేక పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరువకముందే మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల పరిధిలోని అబ్బాపూర్ తండాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
నేనావత్ వినోద్(27) అనే ఆటోడ్రైవర్ ఫైనాన్స్ ద్వారా ఆటోను కొనుగోలు చేసి నడిపేవాడు. అయితే, ఫ్రీ బస్సు కారణంగా గిరాకీ లేకుండా పోయిందని, దీంతో ఫైనాన్స్ వాళ్లు ఆటోను లాక్కున్నారని చెందాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వినోద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.