దేశంలోనే ఎక్కడా లేని ముఖ్యమంత్రి తెలంగాణలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఒక్క నిమిషం కూడా సీఎంగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలనీ జడ్సన్ డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగులు ఆందోళనలు చేపడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన ఎక్కడ ఉన్నారని బక్కా జడ్సన్ ప్రశ్నించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్(Motilal Nayak) ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయనకు మద్దతు తెలుపుతూ సోమవారం బాక్కా జడ్సన్(Bakka Judson)తో పాటు, నిరుద్యోగులు కూడా హాస్పిటల్ ఆవరణలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బక్కా జడ్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జడ్సన్.. అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారని విమర్శించారు. దేశంలోనే ఎక్కడా లేని ముఖ్యమంత్రి తెలంగాణలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఒక్క నిమిషం కూడా సీఎంగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలనీ జడ్సన్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఇన్ని ఇబ్బందులు పడుతూ.. ధర్నాలకు దిగుతుంటే తీన్మార్ మల్లన్న(Thinmar mallanna) ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు గ్రూప్స్ క్వశ్చన్ పేపర్లను అమ్ముకున్నారని, అందుకే 1:100 ప్రకారం క్వాలిఫై చేయడం లేదని ఆరోపించారు.
మంగళవారం తెలంగాణ బంద్(Telangana Bandh) నిర్వహిస్తామని బక్కా జడ్సన్ తెలిపారు. మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.