అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. హైడ్రా పేరుతో డైవర్ట్ చేస్తూ హైడ్రామాలాడుతోందని మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: అక్రమ కట్టడాలు అని తెలిసి కూడా ఎందుకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారని హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైందని బండి అన్నారు. అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. హైడ్రా పేరుతో డైవర్ట్ చేస్తూ హైడ్రామాలాడుతోందని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను మరిపించడానికే హైడ్రా అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. గత కొన్ని రోజులుగా హైడ్రా తీరును చూస్తుంటే చాలా అనుమానాలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. హైడ్రా కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఇదంతా చూస్తుంటే హైడ్రా పట్ల ఉన్న కనీస నమ్మకం కూడా పోతోందని అన్నారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆయన అన్నారు. అక్రమ భవనాలకు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. హైడ్రా కారణంగా పేదలు కష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ సూచించారు.