కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటలో నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకు రైతు వేదికల వద్దసంబరాలు చేసుకుంటున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రుణమాఫీ అంటూ కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపిందని ఆయన అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఇందులో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ ఈ రుణమాఫీ డ్రామా ఆడుతోందని ఆయన ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: గురువారం తెలంగాణలో రూ.లక్ష లోపు రుణాలను సర్కార్ మాఫీ చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర సంబరాలకు ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రుణమాఫీ అంశంపై స్పందించారు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. రబీ, ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకు సంబరాలు జరుపుకుంటున్నారా అని ఆయన ఎద్దేవా చేశారు. రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకు సంతోషపడుతున్నారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటలో నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకు రైతు వేదికల వద్దసంబరాలు చేసుకుంటున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రుణమాఫీ అంటూ కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపిందని ఆయన అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఇందులో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ ఈ రుణమాఫీ డ్రామా ఆడుతోందని ఆయన ఆరోపించారు.
ఇప్పటికీ రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్లో రైతులకు డబ్బు ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదని బండి సంజయ్ స్పందించారు. రైతు భరోసా సదస్సుల పేరుతో ఆలస్యం చేస్తూ అన్నదాతలను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు.