గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి BRSలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, BRSలోకి తిరిగి చేరే ఆలోచనతోనే మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆయన మంగళవారం కలిశారు.
న్యూస్ లైన్ డెస్క్: గత కొంత కాలంగా చేరికలతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటివరకు BRSకు చెందిన 10 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కీలక పరిణామం కాంగ్రెస్దీం పార్టీపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. BRS అంతరించి పోయే అవకాశం ఉందని ఇతర పార్టీల నేతలు విమర్శలు చేశారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ నుండి ఓ కీలక నేత వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి BRSలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, BRSలోకి తిరిగి చేరే ఆలోచనతోనే మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆయన మంగళవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పోతున్నానని కాంగ్రెస్ పార్టీలో కనీసం మర్యాద లేదని, గుర్తింపు లేదని, అవమానానికి గురి చేస్తున్నారని ఆయన వాపోయినట్లు తెలుస్తోంది.