Adulterated Food : అల్లం వెల్లుల్లి కల్తీదా.. నిజమైనదా ఇలా గుర్తించండి.


Published Aug 30, 2024 07:09:17 AM
postImages/2024-08-30/1725019695_gingerAndGarlicpaste.jpg

న్యూస్ లైన్ డెస్క్ :  ఇప్పుడు ఎక్కడ ఏ ఫుడ్ ఐటమ్ కొంటే ఏం కల్తీ అవుతుందో తెలుసుకోలేని పరిస్థితి. అన్నీ ఆమార పదార్థాలను కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. చివరికి పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేసేస్తున్నారు. అందుకే.. మార్కెట్లో ఏది కొన్నా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. మొన్నటికి మొన్న భారీ ఎత్తున కల్తీ వెల్లుల్లి తయారు చేసి అమ్ముతున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. నకిలీ వెల్లుల్లి తయారీలో సీసం, ఇతర లోహపు పదార్థాలు, క్లోరిన్, బ్లీచ్ వేసి నకిలీ వెల్లుల్లి తయారు చేసి అమ్ముతున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలుగుతుంది. ఇక నుంచి మార్కెట్ కి వెళ్లినప్పుడు నకిలీ వెల్లుల్లిని ఈ చిట్కాలు పాటించి గుర్తించండి.

  • నకిలీ వెల్లుల్లి చాలా తెల్లగా ఉంటుంది? దానిపై వేరే ఏ మరకలు కనిపించవు.
  • నిజమైన వెల్లుల్లికి అక్కడక్కడా చిన్న చిన్న మచ్చలుంటాయి.  ఏమాత్రం మరకలు లేకుండా పూర్తిగా తెల్లగా ఉంటే అది నకిలీ కావొచ్చు.
  • వెల్లుల్లిని కొనేటప్పుడు ఒలవడానికి ప్రయత్నించండి. గిచ్చి చూస్తే ఘాటైన వాసన వస్తుంది. అలా వస్తే అది నిజమైనది. లేదంటే కల్తీ అనుకోవాలి.

  • వెల్లుల్లిని కొనేటప్పుడు గట్టిగా నలిపేందుకు ప్రయత్నించండి. ఒకవేళ వెల్లుల్లి నలిగిపోయి చూర్ణంలా అయి ఘాటు వాసన వస్తే అది నిజమైనది. లేదంటే నకిలీ వెల్లుల్లిగా భావించొచ్చు.
  • అందుకే ఇకపై వెల్లుల్లి, అల్లం కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. వీలైతే దాన్ని గిల్లి వాసన చూసి కొనండి.

newsline-whatsapp-channel
Tags : health-news health health-benifits healthy-food-habits garlic-cloves garlic-

Related Articles