బిగ్ బాస్ ఇండియాలో చాలా సినిమా ఇండస్ట్రీలలో అద్భుతంగా దూసుకుపోతున్న షో. డచ్ రియాలిటీ షో బిగ్ బ్రదర్స్ స్ఫూర్తితో ఇండియాలో ఈ షో ఆరంభమైంది. యూకే లో మొదటిసారి ప్రసారమైన బిగ్
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ ఇండియాలో చాలా సినిమా ఇండస్ట్రీలలో అద్భుతంగా దూసుకుపోతున్న షో. డచ్ రియాలిటీ షో బిగ్ బ్రదర్స్ స్ఫూర్తితో ఇండియాలో ఈ షో ఆరంభమైంది. యూకే లో మొదటిసారి ప్రసారమైన బిగ్ బ్రదర్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన శిల్పా శెట్టి టైటిల్ ను కైవసం చేసుకుంది. 2006లో ఈ బిగ్ బాస్ హిందీ సీజన్ వన్ మొదటిసారి ప్రారంభమైంది. ఇప్పటికే 17 సీజన్లు సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న ఈ బిగ్ బాస్ దేశంలోని ఇతర ఇండస్ట్రీలలోకి పాకింది. ఇక తెలుగులో 2017లో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభించారు. మొదటి సీజన్ లో ఎన్టీఆర్, సెకండ్ సీజన్ లో నాని హోస్టుగా వ్యవహరించారు.
ఇక మూడవ సీజన్ నుంచి వరుసగా నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకుంటున్నారు. అప్పటినుంచి ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. అలాంటి ఈ బిగ్ బాస్ కు కంటెస్టెంట్లను ఎలా ఫైనల్ చేస్తారు ఏ విధంగా ఉంటుందని వివరాలు చూద్దాం. కంటెస్టెంట్లు ఎంపిక అనేది మూడు విధాలుగా ఉంటుందట. బుల్లితెరపై పాపులర్ అయిన వారు, సోషల్ మీడియా స్టార్స్, కమెడియన్స్ , సామాన్యులు ఇలా మూడు క్యాటగిరీలుగా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారట.
ఇందులో బుల్లితెర కమెడియన్స్, సోషల్ స్టార్స్ ను, బిగ్ బాస్ మేకర్స్ స్వయంగా సంప్రదిస్తారు లేదంటే వారికి ఫోన్లు చేసి మీకు ఆసక్తి ఉందా అని తెలుసుకుంటారట. వీరిని మూడు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి వారి వ్యక్తిత్వం, ఎంటర్టైన్ చేయగలరా, అక్కడి ప్రతికూల పరిస్థితులు తట్టుకోగలరా అనే విషయాలను గమనిస్తారట. ఇందులో ఆసక్తి కనబరిచిన వారిని సెలెక్ట్ చేసి రెమ్యునరేషన్ మాట్లాడతారట. ఒకవేళ అన్ని ఓకే అయితే మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ చేస్తారట. ఇక మూడవ కేటగిరిలో బిగ్ బాస్ నిర్వాహకులని కొంతమంది కలిసి చాన్స్ ఇవ్వాలని కోరుతారు. దీనికి సంబంధించి అనేక అప్లికేషన్స్ వస్తాయి.
ఇందులో నుంచి ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేసి అన్ని ఇంటర్వ్యూలు నిర్వహించి రెమ్యూనరేషన్ ఇస్తే ఇస్తారు లేదంటే లేదట. అయితే ఇప్పటివరకు సామాన్యుల కేటగిరీలో గణేష్ అనే యువకుడు మాత్రమే రెండవ సీజన్ లో వచ్చాడు. తర్వాత గంగవ్వ, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్, నూతన్ నాయుడు, లిస్టులో ఉన్నారు. కానీ వీరంతా సోషల్ మీడియాలో స్టార్లే. కానీ కామన్ కేటగిరిలో ఇప్పటివరకు వచ్చిన వారిలో గణేష్ మాత్రమే ఉన్నారు. ఈసారి కూడా కామన్ కేటగిరిలో ఒకరిద్దరిని తీసుకునే అవకాశం ఉందట. మరి మీరు కూడా బిగ్బాస్ వెళ్లి మీ దశ మార్చుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి.