Parliament Session : దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆ పని చేయండి

రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రశ్నించాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-21/1721557737_bjpcongress.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు సాధించేలా ప్రశ్నించాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించాలని, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని ప్రశ్నించాలని ఆయన కోరారు. ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం పోరాడాలని, ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయాలు సాధించాలని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు ఆయన సూచించారు.

మోడీ మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర అవసరాలను, డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యాలను పెట్టుకుందని గుర్తు చేశారు. ఇప్పటికే ఏపీలోని కోస్తా తీరంలో రూ.60 వేల కోట్ల పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చినట్టు వస్తున్న వార్తలను గమనించాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆ రాష్ట్రానికి నిధులు కూడా సాధించిన విషయం వినోద్ కుమార్ గుర్తు చేశారు.

తెలంగాణలో ఉన్న రెండు జాతీయ పార్టీల ఎంపీలు చెరి 8 ఎంపీ స్థానాలు గెలిచాయని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో గళమెత్తాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గతంలో పార్లమెంట్ లో ఎన్నో అంశాలను లేవనెత్తామని, అందులో కొన్ని సాధించామని వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎంపీ కూడా కేంద్రానికి ఎలాంటి లేఖ రాయలేదని.. కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికైనా బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే. అరుణ ఈ రోజు, రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించి ఖాజీపేట్ లో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసేలా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 17 మంది ఎంపీలు తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని సూచించారు.

 

 

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu telangana-bhavan telanganam parliament telangana-government

Related Articles