RS Praveen: సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి

సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండి యువత, మహిళలకు స్వయం ఉపాధి పొందేలా కృషి చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.


Published Aug 19, 2024 04:20:49 PM
postImages/2024-08-19/1724064649_rsrk.PNG

న్యూస్ లైన్ డెస్క్: సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండి యువత, మహిళలకు స్వయం ఉపాధి పొందేలా కృషి చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని భారాస నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో ఏర్పాటు జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వారిని స్వశక్తితో ఎదిగేలా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై  స్పందించి, పరిష్కరించాలన్నారు. ట్రస్ట్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టి కుల, మతాలు, పార్టీలకతీతంగా ప్రజలకు సేవలందించాలని కోరారు.

రాబోయే కాలంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ వద్ద డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వికలాంగుడైన బాలుకు ట్రై మోటార్ సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు ఏనుగు రాకేష్ రెడ్డి, సేవలాల్ సేన రాష్ర్ట అధ్యక్షులు రాంబాబు నాయక్, ఉపాధ్యక్షులు పోరిక రాహుల్ నాయక్, సేవలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people brs rakesh-reddy rspraveenkumar

Related Articles