నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడనివ్వరా అని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీ నుండి BRS సభ్యుల వాక్ ఔట్ చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపాదించారు. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో BRS సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడనివ్వరా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఇతర సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని BRS సభ్యులు ప్రశ్నించారు.
అయినప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంతో BRS సభ్యులు అసెంబ్లీ నుండి వాక్ ఔట్ చేశారు. కేటీఆర్ ప్రతిపాదనను పక్కన పెట్టి సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్లారు.