Harish Rao: కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.


Published Aug 22, 2024 02:52:07 PM
postImages/2024-08-22/1724318527_cgoons.PNG

న్యూస్ లైన్ డెస్క్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గమైన చర్య అన్నారు.

సో కాల్డ్ ప్రజాపాలనలో నాయకులు, జర్నలిస్టులపై దాడులు చేస్తారా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గళాలను రేవంత్ సర్కారు అణిచివేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఈ దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు అని నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక, రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసే దాకా పోరాటం కొనసాగిస్తామని, ఎక్కడిక్కడ నిలదీస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs congress cm-revanth-reddy harish-rao gadarikishore

Related Articles