Harish Rao: ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి 6200 మంది టీచర్లను తొలగించడం మేన మీరు ఇచ్చిన కానుక అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Sep 04, 2024 02:37:41 PM
postImages/2024-09-04/1725440861_manhoo.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి 6200 మంది టీచర్లను తొలగించడం మేన మీరు ఇచ్చిన కానుక అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని అడిగినందుకు ఉద్యోగాల నుంచి తొలగిస్తారా అని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అని హరీష్ రావు సీఎం రేవంత్‌ని నిలదీశారు.

విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress cm-revanth-reddy residential-teachers harish-rao

Related Articles