నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా సభానాయకులు సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
న్యూస్ లైన్ డెస్క్: నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా సభానాయకులు సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. సభ ప్రారంభం అయిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ సభలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సీఎం క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్న నేపథ్యంలో సభ వద్ద పెద్ద ఎత్తున మార్షల్స్ మోహరించారు. సస్పెండ్ అయినా సరే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు నిరసనలు తెలుపుతూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పోడియం ముందు నేలపై కూర్చొని నిరసన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ నిరసన తెలుపుతున్నారు.
దవ్య వినిమయ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సభలో ఉన్నామని, మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ సభలో చేస్తున్న నిరసనకు ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపింది. సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు కాబట్టి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.