తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు.
TG Assembly : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. శాసన సభలో రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
లాస్య నందిత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం. కానీ.. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజులకే మరణించం బాధాకరమని కేటీఆర్ అన్నారు.
ఇదే శాసన సభలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్ప్డు సాయన్న సంతాప తీర్మానం ప్రవేశపెట్టి.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం. కంటోన్మెంట్ స్థానాన్ని సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా తండ్రి ఆశీస్సులతో బ్రహ్మాండమైన మెజారిటీతో లాస్య గెలిచింది. కానీ..ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజులకే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అటు లాస్య కుటుంబానికి, బీఆర్ఎస్ కుటుంబానికి తీరని లోటని కేటీఆర్ భావోద్వాగానికి గురయ్యారు.