ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. కాగా శుక్రవారం ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం పాలసీ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం కవిత పిటిషన్ పై విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె.వి విశ్వనాథన్ ల బెంచ్ విచారించనున్నారు. అయితే ట్రయల్ కోర్టు, హై కోర్టు కవిత బెయిల్‌ను నిరాకరించారు. ప్రస్తుతం ఆమె ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు.