నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్‌ను దాఖలు చేసింది. ప్రమాదం జరిగి పది రోజులవుతున్నప్పటికీ కార్మికుల ఆచూకీ లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఎస్ ఎల్ బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సేఫ్ గా తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్‌ను దాఖలు చేసింది. ప్రమాదం జరిగి పది రోజులవుతున్నప్పటికీ కార్మికుల ఆచూకీ లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నల్ సహయకచర్యల్లో ఆర్మీ, తో పాటు సింగరేణి రెస్క్యూ టీం , ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు కూడా ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరవై నాలుగు గంటలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సహాయక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కోర్టుకు తెలిపారు. అడ్వొకేట్ జనరల్ తెలిపిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు పిల్‌పై విచారణను ముగించింది.