Narendra Modi: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !

ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి మంచి బూస్టింగ్ గా ఉంటుంది. నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు సాయం చెయ్యడమే ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశ్యం.


Published Mar 28, 2025 08:23:00 PM
postImages/2025-03-28/1743173712_DAHikeAnnouncement.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు ఎన్డీయే సర్కారు శుభవార్త చెప్పింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతున్నట్లు నేడు వెల్లడించింది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్ష తన కేంద్రకేబినేట్ సమావేశమైంది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. అటు రూ. 22,919 కోట్లతో పీఎల్ ఐ పథకానికి కేంద్రకేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి మంచి బూస్టింగ్ గా ఉంటుంది. నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు సాయం చెయ్యడమే ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశ్యం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu centralgovernment pm-modi

Related Articles