ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలసత్వం, పాలనపై అవగాహన లేకపోవడం, నాయకత్వ వైఫల్యం కారణంగానే మున్నేరు వరద బీభత్సం జరిగిందని బీఆర్‌ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలసత్వం, పాలనపై అవగాహన లేకపోవడం, నాయకత్వ వైఫల్యం కారణంగానే మున్నేరు వరద బీభత్సం జరిగిందని బీఆర్‌ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్నేరుకు వరద రావడం కొత్తేమీ కాదు. గత ఏడాది కూడా మున్నేరు నది 32 అడుగుల మేర ప్రవహించింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే భారీ ఆస్తి నష్టం జరిగింద. వరద వల్ల ప్రతి ఇంటికి సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. అదే ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే అప్రమత్తమై ఇంట్లోని వస్తువులను అయినా కాపాడుకునేవారు.
పాలనపై అవగాహన లేని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతోనే భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. విలువైన టీవీలు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, మంచాలు, పరుపులు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, బీరువాలు, టేబుళ్లు, ఫ్యాన్లు, కుర్చీలు, గ్యాస్ పొయ్యిలు, సర్టిఫికెట్లు, ఫోన్లు, వాచీలు, పుస్తకాలు, వంట సామగ్రి, డబ్బులు, బంగారు నగలు, విలువైన దుస్తులు మొత్తం వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని ఇంట్లోనే బురదలో కూరుకుపోయాయి. ప్రభుత్వం వెంటనే మున్నేరు వరద బాధితులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.