KTR: హామీలు నేరవేర్చకుంటే.. చెట్టుకు కట్టేసి కొడుతాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యఖ్యలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి హామీలు నేరవేర్చకుంటే చెట్టుకు కట్టేసి కొడుతా, తొండలు జొర్రకొడుతా అని చెప్పారు.


Published Aug 22, 2024 03:23:58 PM
postImages/2024-08-22/1724320438_tonda.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యఖ్యలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి హామీలు నేరవేర్చకుంటే చెట్టుకు కట్టేసి కొడుతా, తొండలు జొర్రకొడుతా అని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు నేరవేర్చకుంటే అదే పని ఆయనకు చేస్తారని కేటీఆర్ అన్నారు. ఏ ఊరిలోకి అయిన సరే వెళ్లి అడుగుదాం.. ఒక్కరైనా నీ పాలనను మెచ్చుకుంటున్నారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. రేవంత్ అన్ని ప్రాజెక్ట్‌లు రద్దు చేసి ప్రజలను ఆగం చేస్తుండాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు.. భారత రైతు సమితి కూడా అని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు.. నీ ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల మీద కూడా వెంటపడుతామని తెలిపారు. మీరు ఇచ్చినా ఏ హామీకి సంబంధించి అయిన సరే మిమ్మల్ని వెంటాడటమే మా లక్ష్యం అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్కటై కాంగ్రెస్ 420 హామీలను ప్రజల ముందు పెడదామని అన్నారు. రేవంత్ రెడ్డి లాగా మనం బజారు బాష మాట్లాడాల్సిన అవసరం లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ బరాబర్ చేయాల్సిందే అని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs ktr farmers cm-revanth-reddy runamafi

Related Articles