బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా బెయిల్ వచ్చిందని, వాళ్లు కూడా బీజేపీతో కుమ్మక్కైయ్యారా అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనికిమాలిన ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు కూడా వారం రోజుల క్రితమే బెయిల్ వచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.