బడ్జెట్ పద్దును స్పీకర్ తో పాటు మండలి చైర్మన్, సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్ర బడ్జెట్ కు మంత్రి వర్గం నుండి ఆమోద ముద్ర పడింది. మరికాసేపట్లో బడ్జెట్ పద్దును గవర్నర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందించనున్నారు. బడ్జెట్ పద్దును స్పీకర్ తో పాటు మండలి చైర్మన్, సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కాగా, తెలంగాణ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ రూ.2,75,891 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి రూ.2.97 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.