గత ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఆగస్టు 1 నుంచి 2 నెలల కాలానికి బడ్జెట్ పొడగించనున్నారు. నేటి భేటీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్‌కు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు వంటి వాటిపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
న్యూస్ లైన్ డెస్క్: నేడు ఏపీ రాష్ట్ర మంత్రి కేబినెట్ భేటీ జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈరోజు జరగబోయే సమావేశంలో పలు కీలక అంశాలతో పాటుఆర్డినెన్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి వాటిపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఆగస్టు 1 నుంచి 2 నెలల కాలానికి బడ్జెట్ పొడగించనున్నారు. నేటి భేటీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్‌కు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు వంటి వాటిపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
నూతన ఇసుక విధాన రూపకల్పనపై మంత్రులతో కలిసి కేబినెట్‌లో చర్చించనున్నారు. 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూకబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్టును తీసుకొచ్చే అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళిక వేయనుంది.