రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు అంత సిద్ధమైంది. ఇదే తరుణంలో పల్లెల నుంచి పట్టణాల వరకు గణేష్ మండపాలన్ని ముస్తాబైపోయాయి. అంతేకాకుండా తెల్లారితే
న్యూస్ లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు అంత సిద్ధమైంది. ఇదే తరుణంలో పల్లెల నుంచి పట్టణాల వరకు గణేష్ మండపాలన్ని ముస్తాబైపోయాయి. అంతేకాకుండా తెల్లారితే రాష్ట్రం మొత్తం భక్తి రసాభావంలో మునిగిపోతుంది. కేవలం పెద్ద పెద్ద మండపాలు వేసి వినాయకుడిని పూజించడం కాదు ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా గణపతిని పెట్టుకుని నవరాత్రుల పూజ చేస్తారు. మరి అలా గణపతి నవరాత్రులు పూజలు జరుపుకునే సమయంలో ఇంట్లో అన్ని కలిసివస్తేనే పూజలు చేస్తారు. మరి అలాంటి నవరాత్రుల సందర్భంగా ఇంట్లో ఉండే ఇల్లాలికి లేదంటే ఇంకా ఎవరికైనా నెలసరి వస్తే పరిస్థితి ఏంటి..
ఈ సంవత్సరం జరుపుకునే పూజా ఈసారి ఆగిపోవాల్సిందేనా.. మరి ఆడవాళ్లు అలా ఉంటే గణపతి నవరాత్రుల పూజ చేయవచ్చా.. దీని గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం..సాధారణంగా మహిళలకు నెలసరి వచ్చిన టైంలో ఇంట్లో ఎలాంటి పూజలు చేయకుండా ఉంటారు. ప్రతి హిందువు ఇంట్లో పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ టైంలో స్త్రీలు దేవుడి ఆరాధన కూడా చేయకుండా ఉండాలని అంటారు. కానీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆడవాళ్లకు నెలసరి వస్తే ఎలాంటి అభ్యంతరం లేకుండా వినాయక చవితి పూజలు జరుపుకోవాలని పురోహితులు అంటున్నారు. నెలసరి వచ్చిన వారు తప్ప మిగతా వారంతా ఆ పూజలో కూర్చోవచ్చట.. అయితే ఈ సమయంలో స్త్రీలు చాలా అలసట పొంది చికాకు ఎదుర్కొంటారు. కాబట్టి పూజపై వాళ్లు సరైన దృష్టి పెట్టారు కాబట్టి వారిని విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే పక్కన ఉంచుతారట. అంతేకానీ ఆమెకు పెరియడ్స్ వచ్చాయని అస్సలు అభ్యంతరం చెప్పకూడదట.
వారి ఆరోగ్యరీత్యా హెల్త్ సహకరించదు కాబట్టి పూజకు దూరంగా ఉండాలని అంటున్నారు.. అలా ఇంట్లో ఇల్లాలు లేదంటే ఇతరులు నెలసరిలో ఉంటే ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులంతా ఎంచక్కా పూజ చేసుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాదు మహిళల నెలసరి సమయంలో నిత్యం జరిపే పూజలను కూడా వాయిదా వేయాల్సిన అవసరం లేదట. నెలసరి వచ్చిన స్త్రీ కూడా ఎంచక్కా స్నానం చేసి మంచి దుస్తులు ధరించి భర్త పక్కన కూర్చుంటే సరిపోతుందని కొంతమంది శాస్త్ర పండితులు అంటున్నారు.