చిన్నారులకు చికిత్స అందించే వార్డులలో కూడా రద్దీ మరింత పెరిగిపోయింది. దీంతో పిల్లల తల్లిందండ్రులు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ మలేరియా, సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు సరిపోవడం లేదని వాపోతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మరోవైపు హాస్పిటళ్లలో కేసులు మరింత పెరిగిపోతున్నాయి. దీంతో బెడ్లు సరిపోకపోవడంతో పేషేంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఎమర్జెన్సీ వార్డుల్లో కూడా గుంపులు గుంపులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పేషేంట్లు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా, హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్‌లో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. చిన్నారులకు చికిత్స అందించే వార్డులలో కూడా రద్దీ మరింత పెరిగిపోయింది. దీంతో పిల్లల తల్లిందండ్రులు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు సరిపోవడం లేదని వాపోతున్నారు.
దీంతో అందరినీ ఒకే వార్డులో ఉంచుతున్నారని తెలిపారు. ఒక్కో బెడ్డుపై ముగ్గురు పేషేంట్లను ఉంచినప్పటికీ.. స్థలం సరిపోవడం లేదని వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక.. చిన్నారులను ఒడిలో ఉంచుకొని ట్రీట్‌మెంట్ చేయించాల్సిన పరిస్థితి వస్తోందని వెల్లడించారు.
ఇలా ఒకే వార్డులో అందరినీ ఉంచడం వల్ల ఒకరి వ్యాధి మరొకరికి సోకే ప్రమాదం ఉందని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ స్పందించాలని కోరుతున్నారు. హాస్పిటల్ లో సరైన వసతులు కల్పించాలని.. బెడ్ల సంఖ్య కూడా పెంచాలని కోరుతున్నారు.