పది రూపాయిల నాణాలు 10 చెల్లుబాటు పై సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ధారా సింగ్ కీలక ప్రకటన చేశారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రూ.10 నాణెం చెల్లుబాటు పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పది రూపాయిల నాణాలు 10 చెల్లుబాటు పై సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ధారా సింగ్ కీలక ప్రకటన చేశారు వీటిని రోజువారీ లావాదేవీల్లో ఉపయోగించవచ్చని ...పదిరూపాయిల కాయిన్స్ చెల్లుబాటులోనే ఉన్నాయని తెలిపారు. నార్త్ లో ఈ కాయిన్స్ బాగానే చెలామణి అవుతున్నా ..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ కాయిన్స్ ను అసలు వాడకలో ఉంచడం లేదు.
హైదరాబాద్‌లోని కోఠి బ్యాంకు వద్ద రూ.10 నాణేల చలామణిపై ఆవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నాణేల చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలనే ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆటో వాలాలు కాని ..నిత్యావసరాల్లో పది కాయిన్స్ తీసుకోనని చెబితే కంప్లెయింట్ చేస్తామని తెలపవచ్చని అన్నారు.
తమ బ్యాంకు ఖాతాదారులు ఎవరైనా ఈ నాణేలను నిరభ్యంతరంగా వినియోగించవచ్చని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఇవి చెల్లుబాటు అవుతున్నాయన్నారు. రూ.10 నాణేలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. రూ.10 నోటు కంటే నాణెం ఎక్కువ కాలం మన్నికతో ఉంటుందన్నారు. బ్యాంక్ చాలా ఖర్చు చేసి పది నాణాలు తయారుచేయిస్తే వాటిని వాడకుండా పక్కనపడేయడం ఆర్ధికంగా బ్యాంకులకు చాలా నష్టం వాటిల్లుతుందని అన్నారు.