ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లడారు. అది హైడ్రానా.. హైడ్రామానా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పుడు అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు కూల్చివేతలు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా స్థలాలను కాపాడాలని, కానీ కూల్చివేతలు సరికాదన్నారు. రియల్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి ఉందని, కాంగ్రెస్ తనను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంతో పాటు హెచ్ఎండీఏ, ఔటర్ రింగు రోడ్డు వరకు.. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని కొంత భాగం 'హైడ్రా'లో ఉంది. అయితే జీహెచ్ఎంసీ సహా 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు హైడ్రాలో ఉన్నాయి. కాగా, హైడ్రా అక్రమ నిర్మాణాలను గుర్తించి విస్తృతంగా కూల్చివేతలు చేపడుతోంది.