చపాతీ పిండి ఫ్రిజ్ లో పెట్టి దాంతో చపాతీలు చేసుకొని తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదట. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చపాతీ పిండి ముందే కలిపేసి దాన్ని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి కాల్చిన చపాతీని కాస్త ఆలస్యంగా తిన్నా ఏం కాదు. కానీ.. చపాతి పిండిని మాత్రం ఒకేసారి కలిపి.. పలుసార్లు రోటీలు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కలుపుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పిండిని ఫ్రిజ్ లో ఎక్కువసేపు ఉంచితే అందులోని పోషకాలు నశిస్తాయి. దీంతో పాటు అందులో కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చి చేరుతుంది. ఆ పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల పొట్టనొప్పి, వాపు, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే పెద్దలు వీలైనంత వరకు చద్ది పదార్థాలు తినొద్దని ఎప్పటికప్పుడు వండుకొని తినాలని చెప్తుంటారు.
రెండు మూడు రోజులకు సరిపడా చపాతీలు చేసుకునే పిండిని కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. చపాతీలో పేరుకుపోయిన బ్యాక్టీరయా వల్ల కడుపులో గ్యాస్, మలబద్ధకం, ఒళ్లునొప్పులు వంటి సమస్యలకు స్వాగతం పలికినట్టే. దీనికి తోడు రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
పిల్లలకు పెట్టే స్నాక్స్ బాక్స్, వయసు మీద పడిన వారు ఒకపూట అన్నం మానేసి చపాతీ తినడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అందుకే.. ఎప్పటికప్పుడు చపాతీ పిండి కలుపుకోలేక ముందే కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నారు. దీని వల్ల చాలామంది తమకు తెలియకుండానే అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిండి ఎక్కువసేపు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు.. తాజా పిండితో చేసిన చపాతీలతో పోలిస్తే ఫ్రిజ్ లో ఉంచిన పిండితో చేసిన చపాతీలు రుచిగా కూడా ఉండవు. ఇప్పటి నుంచైనా ఫ్రిజ్ లో ఉంచిన పిండిని మళ్లీ మళ్లీ రోటీలా చేసుకోకుండా ఎప్పటికప్పుడు పిండి కలుపుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు