ప్రస్తుతం వానకాలం సీజన్ నడుస్తోంది. ఎక్కడపడితే అక్కడ వానలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు అన్ని పొంగిపొర్లుతున్నాయి. ఈ తరుణంలో చేపలకు కొదవ లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో చేపల కర్రీ ఉంటుంది.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం వానకాలం సీజన్ నడుస్తోంది. ఎక్కడపడితే అక్కడ వానలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు అన్ని పొంగిపొర్లుతున్నాయి. ఈ తరుణంలో చేపలకు కొదవ లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో చేపల కర్రీ ఉంటుంది. చాలామంది చేపలు తీసుకొచ్చిన తర్వాత ఎక్కువగా చేప పులుసు పెట్టుకొని తింటారు. లేదంటే చేపలను ఫ్రై చేసుకుని తింటారు. ఇవి రెండు తప్ప చేపలను ఇంకో విధంగా ఎవరు కూడా ట్రై చేయరు. అలాంటి చేపలతో చేపల ఇగురు వండుకొని తింటే ఇక మీరు వదిలిపెట్టరు. మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి చేప ఇగురులో ఉంటుంది. అలాంటి చేప ఇగురు ఎలా తయారు చేయాలి ఆ విధానం ఏంటో చూద్దాం.
చేప ముక్కలు కిలో
ధనియాలు ఒక టీ స్పూన్
కారం రుచికి సరిపడా
జీలకర్ర ఒక స్పూన్
అల్లం పేస్టు రెండు స్పూన్లు
ఎండుమిర్చి నాలుగు
ఎల్లిపాయ ఒకటి
నూనె తగినంత
పచ్చిమిర్చి నాలుగు
ఉప్పు తగినంత
బిర్యానీ ఆకులు రెండు
తయారు చేసే విధానం :
చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయాలి.
దానిపై పెనం పెట్టి కాస్త నూనె వేసి వేడెక్కాక చేప ముక్కలు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
అవి కాలిన తర్వాత ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
ఒక మిక్సీ జార్లో అల్లం, పసుపు, కారం, ధనియాలు, ఉప్పు నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత స్టౌ పై మరో కళాయి పెట్టి నూనె పోసుకోవాలి. అందులో ఉల్లిపాయ, బిర్యానీ ఆకులు వేయాలి.
అది పూర్తిగా వేగిన తర్వాత రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ను వేసి బాగా కలుపుకోవాలి.
ఇదంతా ఒక ఇగురులా ఉడుకుతున్న సమయంలో చేప ముక్కలను అందులో వేయాలి.. అయితే ముక్కలు ఉడకడానికి చిన్న గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో పోయాలి. పొడవుగా పచ్చిమిర్చిలను కట్ చేసి అందులో వేయాలి.. చివరగా చిన్న మంట మీద ఉడికేంతవరకు వెయిట్ చేయాలి. నూనె పైకి తేలుతూ ఉంటే ఇగురు రెడీ అయినట్టే.. ఆ తర్వాత పైన కాస్త కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలో ఆ ఇగురు వేసుకొని తింటే, రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.