వీధి కుక్కల కారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని ప్రజలు వాపోతున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు దాకా వెళ్లింది. హైదరాబాద్నగరంలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదికను ఇచ్చింది. అయితే, కుక్కల దాడి నుండి ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద మరింత పెరిగిపోతోంది. గడిచిన 7 నెలల్లోనే కుక్కకాటు కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. కరీంనగర్, హుజురాబాద్ పట్టణంతో పాటు బోర్నపల్లి గ్రామాల్లోని వివిధ ప్రాంతాల్లో 25 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా.. నగరంలో, జిల్లాల్లో, గ్రామాల్లో కూడా గ్రామ సింహాల వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వీధి కుక్కల కారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని ప్రజలు వాపోతున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు దాకా వెళ్లింది. హైదరాబాద్నగరంలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదికను ఇచ్చింది. అయితే, కుక్కల దాడి నుండి ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఖుత్బుల్లాపూర్ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, తమను రక్షించాలని చిన్నారులు కోరిన తీరు హృదయవిదారకంగా ఉంది. వీధి కుక్కల దాడి నుండి తమను రక్షించాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పెద్ద సంఖ్యలో చిన్నారులు కోరారు. వీధి కుక్కల నుండి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు రాశారు. అందులో కొంపల్లి మున్సిపల్ కమిషనర్,చైర్మన్ పేర్లు జతచేసారు.