వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలయ్యారు.
హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు నాళాలో వచ్చే తాగు నీరు కారణంగానే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. చిన్నారులకు హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: గ్రామ పంచాయితీ నాళాల్లో వచ్చిన కలుషిత నీరు తాగడంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందుకూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలయ్యారు.
హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు నాళాలో వచ్చే తాగు నీరు కారణంగానే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. చిన్నారులకు హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ నాళాల్లో అపరిశుభ్రమైన నీటిని ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులు ఆస్పత్రిపాలైన ఘటన చుసిన తరువాతైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.