CI: ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సీఐ

తల్లిదండ్రులు కొడుకుని చదివించి సీఐ చేస్తే.. కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి మాత్రం ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టాడు.


Published Aug 06, 2024 03:54:51 PM
postImages/2024-08-06/1722939891_circle.PNG

న్యూస్ లైన్ డెస్క్: తల్లిదండ్రులు కొడుకుని చదివించి సీఐ చేస్తే.. కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి మాత్రం ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టాడు. దీంతో తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని సీఐ తల్లిదండ్రులు మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు.

రఘునాధ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు. అయితే 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ, హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై చిన్నకొడుకు ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి, అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 


 

 


 

newsline-whatsapp-channel
Tags : telangana police dgp parents

Related Articles