Revanth reddy: పిల్లల ముందే నోరు పారేసుకున్న సీఎం.. కేసీఆర్ సచ్చేదెప్పుడో అంటూ..!

తాజగా, దీనిపై స్పందించిన రేవంత్.. ఇష్టారీతిలో మాట్లాడుతూ నోరుపారేసుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే కేటీఆర్ గత కొంత కాలంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.


Published Aug 20, 2024 12:50:06 PM
postImages/2024-08-20/1724138406_Revanthanumula.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి నోరుపారేసుకున్నారు. రాష్ట్రానికి సీఎంగా ఉంటూ.. తన హోదాను మరిచిపోయి నోరుజారారు. చిన్నపిల్లలను ముందు పెట్టుకొని మాట్లాడుతున్నారనే కనీస ఆలోచన కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న తీరును చూసి పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజీగూడలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి స్కూల్ పిల్లలు కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ప్రస్తావించారు. ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు సహా ఇతర పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజగా, దీనిపై స్పందించిన రేవంత్.. ఇష్టారీతిలో మాట్లాడుతూ నోరుపారేసుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే కేటీఆర్ గత కొంత కాలంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారని పలువురిని అడిగితే.. సచివాలయం ముందు మాజీ మంత్రి, BRS అధినేత కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని కేటీఆర్ అనుకుంటున్నారని ఎవరో చెప్పారని ఆయన అన్నారు. 

కేసీఆర్ పోయేది ఎప్పుడూ.. కేటీఆర్ ఆ విగ్రహాన్ని పెట్టేది ఎప్పుడని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఆయన మాటలు విన్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలను ఎదురుగా పెట్టుకొని ఎటువంటి మాటలు అంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని అనుకున్నామని కేటీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ స్థలంలో కేసీఆర్ విగ్రహాన్ని పెట్టడం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy news-line newslinetelugu telanganam cm-revanth-reddy rajivgandhi

Related Articles