Revanth reddy: అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి, మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
 
Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-09/1720529405_modi67.jpg

న్యూస్ లైన్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నూతన కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, విద్య, వైద్యం వంటి అంశాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మొత్తం రూ.396.09 కోట్ల వ్యయంతో  అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. 

పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి, మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

గండీడ్‌లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి, పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు, మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో  ఎస్టీపీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. 

newsline-whatsapp-channel
Tags : revanth-reddy newslinetelugu congress telanganam cm-revanth-reddy mahbubnagar

Related Articles