Cm: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు పంప్ 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.


Published Aug 15, 2024 02:43:29 PM
postImages/2024-08-15/1723713209_sitaram.PNG

న్యూస్ లైన్ సినిమా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు పంప్ 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ప్రారంభించారు. అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సీతారామ ప్రాజెక్టులో భాగంగా మొత్తం మూడు పంప్​ హౌస్​ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు పంప్​ హౌస్​లను ఇప్పటికే ట్రయల్​ రన్​ పూర్తి చేసిన సండతి తెలిసిందే.

ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్​ హౌస్​ను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించగా, కమలాపూర్​ పంప్​ హౌస్​ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం మూడో విడత రుణమాఫీలో భాగంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణాల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరావు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people cm-revanth-reddy sitarama-project bhattivikramarka

Related Articles