Cm Revanth: రీజనల్ రింగ్ రోడ్డుపై ముగిసిన సీఎం సమీక్ష

సచివాలయంలో రీజనల్​ రింగ్​ రోడ్డుపై ఉన్నతాధికారులతో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు


Published Aug 21, 2024 06:57:57 AM
postImages/2024-08-21/1724238304_ringroad.PNG

న్యూస్ లైన్ డెస్క్: సచివాలయంలో రీజనల్​ రింగ్​ రోడ్డుపై ఉన్నతాధికారులతో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు రోజూవారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి వివరించాలని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అలైన్ మెంట్ ఉండాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ మార్గాల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. 

ఆర్ఆర్ఆర్ కింద సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా దక్షిణ భాగంలో చౌటుప్పల్ - ఆమ‌న్‌గ‌ల్‌ - షాద్ న‌గ‌ర్‌ - సంగారెడ్డి (189.20 కి.మీ) మార్గానికి సంబంధించి భూ సేక‌ర‌ణ, అలైన్‌మెంట్‌ అంశాలపై సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy orr ias-officer meetings

Related Articles